Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
రాష్ట్ర ప్రభుత్వం గౌడకులస్తుల సమగ్ర అభివృద్ధి కోసం గౌడబంధును వెంటనే అమలు చేయాలని గౌడ జనహక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చిత్తలూరు నారాయణగౌడ్ డిమాండ్ చేశారు.ఆదివారం మండలకేంద్రంలోని సాయిరాం ఫంక్షన్హాల్లో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖ ద్వారా గౌడకులస్తులు తరతరాల నుండి శిస్తురూపంలో ఆదాయం కల్పిస్తున్న గౌడకులస్తులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు.అధిక జనాభా కలిగిన గౌడకులస్తులకు ప్రభుత్వబడ్జెట్లో రూ.500 వేల కోట్లను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.ప్రమాదవశాత్తు మరణించిన వారికుటుంబసభ్యులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియాను 15 రోజుల లోపు అందించాలని, పింఛన్లను రూ.5 వేలకు పెంచాలని కోరారు. నాటి ఐక్య పోరాటాలు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, ధర్మభిక్షం, తొట్ల మన్సూర్ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని హక్కులను సాధించుకోవాలని కోరారు.వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బిక్కి బుచ్చయ్యగౌడ్, మండలఅధ్యక్షులు పులుసు లింగమల్లయ్యగౌడ్,గౌడనాయకులు గుండగాని రాములుగౌడ్, తొట్ల ప్రభాకర్‌గౌడ్, బత్తుల సాయిలుగౌడ్, తండుసత్యనారాయణ గౌడ్, ఆకుల ఉప్పలయ్యగౌడ్, లింగాల సతీష్‌గౌడ్,రేసు రాములుగౌడ్, కప్పలరామ్మూర్తిగౌడ్, యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.