Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నవతెలంగాణ-హుజూర్నగర్
ప్రయివేట్ విద్యుత్ ఎలక్ట్రిషన్ల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం పట్నంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రయివేట్ ఎలక్ట్రిషన్ల నియోజకవర్గం మూడవ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం తరఫున ప్రయివేట్ విద్యుత్ ఎలక్ట్రిషన్ సర్వేనెంబర్ పరిష్కరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కాకుండా ప్రయివేట్ బీమా సౌకర్యం కల్పించడానికి సహకరిస్తానన్నారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా కల్పిస్తుందని తెలిపారు. విద్యుత్ ఎలక్ట్రిషన్లు ప్రమాద అంచున పని చేస్తున్నారని, బీమా వారికి అత్యంత అవసరమన్నారు. ఈ కార్యక్రమాలు నియోజకవర్గం కార్మిక సంఘం నాయకుడు పచ్చిపాల ఉపేందర్, మున్సిపల్ వైస్ చైర్మెన్ జక్కులనాగేశ్వరరావు, ప్రయివేట్ ఎలక్ట్రిషన్ వర్కర్స్ సంఘం నాయకులు పాల్గొన్నారు.