Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు బడ్జెట్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు డిమాండ్ చేశారు.ఆదివారం మండలకేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకులసమావేశం రాంప్రభు నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు పూర్తవుతున్న ఇప్పటివరకు బీసీలకు స్వయం సహాయక రుణాలు గాని, చేతివృత్తులు, కులవృత్తులు చేసుకునే వారికి ఎటువంటి ఆర్థికసహాయ సహకారాలు అందించకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.చాలామంది బీసీ యువకులు ఉద్యోగ అవకాశాలు రాక,వాళ్ల కాళ్ల మీద వాళ్లు స్థిరపడడం కోసం వ్యాపారాలు పెట్టుకుంటామంటే ఆర్థిక స్తోమత లేక వారు ఆ ఆలోచనను వెనక్కు తీసుకుంటున్నారన్నారు.కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలని కోరారు.అదేవిధంగా త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనాభా లెక్కల్లో కులాల వారీగా లెక్కించాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బస్సుయాత్ర చేపడ్తామన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమసంఘం నాయకులు అనంతుల శ్రీనివాస్‌గౌడ్, అంబటి మహేష్‌గౌడ్, షీలా ఉపేందర్‌గౌడ్, కాసాని శ్యాముయాదవ్, చిలకల ప్రకాష్‌యాదవ్, ముత్తినేని అంజయ్య, తాళ్లపల్లి లింగయ్య, ఉపేందర్, మహేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.