Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
పోస్టల్శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మండల కేంద్రంలోని ఉపతపాలా కార్యాలయం వద్ద నుండి పోస్టల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ పోస్ట్ మాస్టర్ ధారవత్ చందు లాల్నాయక్, మెయిల్ వర్సల్ గొల్లపల్లి కోటయ్య మాట్లాడుతూ పోస్టల్శాఖ అందేంచే పథకాలైన పిఎల్ఐ, ఆర్పీఎల్ఐలో తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ లభిస్తుందని, ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీటితో పాటు పొదుపు పథకాలైన ఆర్డీ, ఎస్బి, ఎస్ఎస్ఏ, టీడీ, సీనియర్ సిటిజన్, ఎన్ఎస్సీ, ఏంఐఎస్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం భారీగా వడ్డీ రేట్లు పెంచినందున ప్రతి ఒక్కరూ పోస్టల్ పథకాల్లో చేరాలని కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఎంలు నరేష్, వీరాంజనేయులు, బీపీఎంలు పుల్లయ్య, నాగరాజు, రాము, శ్రీయాంక, రాంబాబు, ఎబిపియంలు మహబూబ్ బాషా, వెంకతాచారి, ఎస్కే. సైదులు, తదితరులు పాల్గొన్నారు.