Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
నవతెలంగాణ-నల్లగొండ డెస్క్
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం సీపీిఐ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించకుండా ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అప్రకటిత నిర్బంధాన్ని స్వేచ్ఛ హరిస్తూ ప్రజాస్వామిక వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. ఆర్థిక అసమానతలు పెంచి పోషిస్తూ రైతులను కార్మిక ప్రయోజనాలను కాలరాస్తున్నది జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయకుండా మరింత కాలయాపన చేస్తుందని తెలిపారు. జిల్లావ్యాపంగా ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను తక్షణమే పూర్తి చేసి అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్‌రెడ్డి, ఎల్.శ్రావణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు బీ.వెంకటరమణ, మందడి నరసింహారెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, పబ్బు వీరస్వామి, ఆర్. అంజాచారి, జీ.రామచంద్రన్, టీ.వెంకటేశ్వర్లు, బొలుగూరి నరసింహ, గిరి, రమ తదితరులు పాల్గొన్నారు.