Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహాదేవ్
నవతెలంగాణ-సూర్యాపేట
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టోర్నమెంట్ల నిర్వహణతో చెస్ క్రీడావ్యాప్తికి ఎంతో దోహదపడుతుందని సుధాకర్ పీవీసీఎండి, సుధా బ్యాంకు చైర్మెన్ మీలామహాదేవ్ అన్నారు.స్వర్గీయ మీలా సత్యనారాయణ సంస్మరణార్ధం ఆదివారం స్థానిక పబ్లిక్క్లబ్లో చదరంగం పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు,సుధా బ్యాంకు యండి పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 150 మంది బాలబాలికలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.జిల్లాలో చెస్ క్రీడావ్యాప్తికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు.మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్, విశిష్టఅతిథి పెద్దిరెడ్డి రాజా మాట్లాడుతూ గతంలో తాను మీలా సత్యనారాయణతో కలిసి రాష్ట్రస్థాయి క్రీడా ఉత్సవాలను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.ఇదే కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి పారుపల్లి చంద్రశేఖర్ జిల్లాలో చెస్ క్రీడ కార్య కలాపాలను తమ సంస్థ చేపట్టిన ఎన్నో చెస్ క్రీడల వివరాలను వివరించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న చెస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వలపట్ల దయానంద్ రచించిన చదరంగంపై పాటను ప్రముఖ గాయకుడు వెన్నెల నాగరాజు పాడి వినిపించారు.ఈ టోర్నమెంట్లోనూ ను మీలా మహదేవ్,పెద్దిరెడ్డి రాజా చెస్ చదరంగంలో మొదటి ఎత్తు వేసి లాంఛనంగా ప్రారంభించారు.వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన బాలబాలికలకు కోచులకు తల్లిదండ్రులకు అసోసియేషన్ చక్కని భోజన వసతి కల్పించారు.ఈ కార్యక్రమంలో నర్సింహారావు,మురళి, కర్నాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.