Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యాట్ పై పోటీలు నిర్వహణ
- డే అండ్ నైట్ జరుగుతున్న పోటీలు
- భారీగా తరలిరానున్న క్రీడాకారులు
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలోని తుంగతుర్తి గ్రామంలో శ్రీ స్వయంభూ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాలలో భాగంగా నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర స్థాయి పురుషుల ఇన్విటేషన్ కబడ్డీ మ్యాట్‌పై జరిగే పోటీలకు మండలంలోని తుంగతుర్తి గ్రామం ముస్తాబవుతుంది. దానికి సంబంధించిన గ్రౌండ్‌ను కమిటీ సభ్యులు ఆదివారం పరిశీలించారు. డే అండ్ నైట్ జరిగే ఈ పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు రానున్నారు. దీనికి ఏర్పాట్లు భారీగా చేస్తున్నామని, అందరికి అన్ని వసతులు కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నేటి నుంచి జరిగే కబడ్డీ పోటీలకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాజరువుతున్నందున అధిక సంఖ్యలో అభిమానులు, క్రీడాకారులు ప్రజలు రానున్నట్టు పేర్కొన్నారు. ఈ పోటీలలో మొదటి బహుమతి రూ.70,000, రెండవ బహుమమతి 50,000, మూడవ బహుమతి 40,000, నాలుగవ బహుమతి 25,000 లు, ఐదవ బహుమతి 20,000 లు, ఆరవ బహుమతి 15,000లు, ఏడవ బహుమతి 12,000లు, ఎనిమిదవ బహుమతి 10,000 లు, తొమ్మిదవ బహుమతి 7,000 లు ప్రైజ్ మనీ, షీల్డులు బహుకరించడం జరుగు తుందని తెలిపారు. ఆయన వెంట స్థానికులు తదితరులున్నారు.