Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు యోగా గ్రాండ్ ప్రదర్శన నిర్వహించారు. సుమారు 150 మంది విద్యార్థులు హాజరు కాగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇటువంటి కార్యక్రమాల వలన పిల్లల్లో శారీరక, మానసిక వత్తిడి తగ్గించి, చదువు పట్ల, ఇతర విషయాల పట్ల ఆసక్తిని పెంచుకుంటారన్నారు. ఆలోచన శక్తి కూడా పెరుగుతదని చెప్పారు. యోగా భారత సనాతన సంప్రదాయం అని, దానిని తర తరాలకు అందించాలనీ, ఇట్టి బహత్తర మైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పాఠశాల యాజమాన్యాన్ని, యోగా శిక్షకుడు టీ.వినోద్ చంద్రని అభినందించారు. మండల విద్యార్థి అధికారి ఎం.బాలాజీనాయక్ మాట్లాడుతూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు స్కూల్ యాజమాన్యాన్ని, స్కూల్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ డీ. రవినాయక్, ప్రజా వైద్యులు, సోషల్ ఆర్గనైజర్ ఎండీ. మునీర్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేకే. జయరాజన్, గూడపూరి లక్ష్మణ్, పరంగి రాము, రవి నాయక్, ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులు వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.