Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
బీసీ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడలో బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2023 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు శాసన మండలిలో ప్రస్తావిస్తానన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు తక్షణమే పి అర్ సి కమిటీ ఏర్పాటు ఎన్నికలకు ముందే ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా సైదులుముదిరాజ్, బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోత్ దశరథనాయక్, బీసీ ఉపాధ్యాయ సంఘం నియోజకవర్గ ఇన్చార్జి కొప్పోజు శ్రీనివాస్‌చారి, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు నాగవల్లి ఉపేందర్, శ్రీనివాసయాదవ్, రాపోలు భాస్కర్, డాక్టర్ సత్యనారాయణ, రచ్చ వెంకటేశ్వర్లు, కోడి చంద్ర శేఖర్, కంధర బోయిన నాగరాజు, బీసీ సంక్షేమ సంఘ నాయకులు చేగొండి మురళియాదవ్, దాసరాజు జయరాజు తదితరులు పాల్గొన్నారు.