Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ డెస్క్
సీపీఐ(ఎం) విధానాలకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్టు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. నల్లగొండ మండలం ఎం.దుప్పలపల్లి గ్రామానికి చెందిన వెంకట్ కు సోమవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ దేశంలో కార్మిక, కర్షక, సమస్త ప్రజల సమస్యలపై నికరమైన పోరాటాలు నిర్వహిసుంది సీపీఐ(ఎం) అని పేర్కొన్నారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలు గాలికొదిలి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ దేశ సంపదను లూటీ చేయిస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రజల పరం కావాలి, కానీ నేడు పెట్టుబడుదారుల, దోపిడీదారుల వశం అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తే కేంద్రం ఆంక్షలు విధించడం మానవ హక్కులను హరించడమేనన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నలపరాజు సైదులు, మండల కమిటీ సభ్యులు నలపరాజు సైదులు, కుడతాల భూపాల్, తదితరులు పాల్గొన్నారు.