Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ మాజి జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణ
నవతెలంగాణ-దామరచర్ల
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల సందర్భంగా దామరచర్ల మండల కేంద్రంలో విద్యార్థులతో బారి ర్యాలీ నిర్వహించి సోమవారం శిక్షణ తరగతులు ప్రారంభ సూచికగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ ఆవిష్కరణ చేశారు. ఈ శిక్షణ తరగతులకు మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లక్ష్మి నారాయణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేయకుండా ప్రయివేట్ యూనివర్సిటీలకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతూ పేద మధ్య తరగతి విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలిపారు. దేశంలో మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానానికి తీసుకోచ్చి విద్యా రంగంలోకి మతోన్మాద భావజాలాన్ని ప్రేరేపిస్తుందని చెప్పారు. విద్యారంగాన్ని కాషాయికరణ చేయాలనే దృఢం సంకల్పంతో ముందుకు సాగుతోందని, దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్మించాలని, అందరికీ ఉచిత నిర్బంధ విద్య ఉపాధి వైద్యం కోసం సమర శీల ఉద్యమాలు చేపట్టి దేశంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న సందర్భంగా విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా సంస్థలనూ బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో అన్ని యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ గెలుస్తుందంటే ఎస్ఎఫ్ఐ నిరంతరం విద్యార్థుల కోసం పని చేయడం వల్లనే అన్నారు. భవిష్యత్తులో మిరందరు కూడా ఆగ్రా బాగాన నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి వినోద్ నాయక్, గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు పాప నాయక్, సీఐటీయూ మండల కార్యదర్శి దయానంద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, మిర్యాలగూడ డివిజన్ కార్యదర్శి కోర్ర సైదా నాయక్, జిల్లా సహాయ కార్యదర్శి బుడిగ వేంకటేష్, కోరె రమేష్ బిట్టు రేణుక జగన్ , వధూద్ సమ్మద్ , దామరచర్ల మండల కార్యదర్శి థీరవత్ వీరన్న, సూర్య ,వేములపల్లి మండల కార్యదర్శి పుట్ట సంపత్, సాయి తదితరులు పాల్గొన్నారు.