Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడియో కాన్పరెన్స్‌లో మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-నల్లగొండ డెస్క్
ఫిబ్రవరి నెలలో పోడు భూముల పట్టాలను అర్హులకు పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో కంటి వెలుగు, మన ఊరు మన బడి, పోడు భూములు, పామ్ ఆయిల్, ఉపాధ్యాయుల బదిలీలు, జీఓ 58, 59 లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ టీ.వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్తా, అదనపు కలెక్టర్(రెనెన్యు) భాస్కర్ రావు, అటవీ శాఖ కన్జర్వేటర్ శివానీ డోగ్రా, డీఎఫ్ఓ రాం బాబు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇంఛార్జి అధికారి రాజ్ కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు, విద్యాశాఖ అధికారి బిక్ష పతి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంగీత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.