Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ డెస్క్
మున్సిపల్ కార్మికులకు రావలసిన 11వ పీిఆర్సీ ఏరియర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఎండీ.సలీం కోరారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ కేవీ.రమణాచారికి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ను అందించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ 2021 జూన్ నుండి 11వ పీఆర్సి పెరిగిన వేతనాలు మున్సిపల్ కార్మికులకు అమలు చేస్తామని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. నలగొండ మున్సిపాలిటీలో జూన్ 2022 నుండి పెరిగిన వేతనాలు అమలు చేశారని, రావలసిన పెండింగ్ ఏరియర్స్ వెంటనే ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ పట్టణ కార్యదర్శి పెరికి కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, పందుల లింగయ్య, చింతకాయల సంతోష్, శ్రీదేవి, జీడిమెట్ల నరసింహ, తదితరులు పాల్గొన్నారు.