Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీశైలం
నవతెలంగాణ-మునుగోడు
పేదలకు సొంతింటి కల నెరవేర్చాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సొంతం ఇంటి స్థలం ఉన్న నిరుపేదలందరికీ ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సొంత ఇంటి స్థలాలు కలిగి ఉన్నవారికి ప్రభుత్వం 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తామనిహామీ ఇచ్చి, నేటికీ అమలు చేయకుండా జాప్యం చేస్తుందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా 3 లక్షల ఏ మూలకు సరిపోవని తెలిపారు. ఇంటి మెటీరియల్ ధరలు పెరిగినందున, తక్షణమే ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేసి నిరుపేదలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఫిబ్రవరి 3న తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా, ఫిబ్రవరి 9న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాలో పేదలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇదే సందర్భంగా వృత్తి రక్షణ, వృత్తి సంక్షేమం కోసం జరిగే బడ్జెట్ సమావేశాలలో 20,500 కోట్ల రూపాయలు వృత్తిదారులకు కేటాయించి, విధి విధానాలు రూపొందించి వృత్తిదారులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) చండూరు మండల కార్యదర్శి మోగుదాల వెంకటేశం, చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, మండల కమిటీ సభ్యులు గౌసియా బేగం, కొత్తపల్లి నరసింహ, చిట్టి మల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
చండూర్ : పేదలకు సొంతింటి కల నెరవేర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. సోమవారంసిపిఎం చండూరు మండలం కమిటీ సమావేశం సీపీఐ(ఎం) మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) చండూరు మండల కార్యదర్శి మోగుదాల వెంకటేశం, చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయగౌడ్, మండల కమిటీ సభ్యులు గౌసియా బేగం, కొత్తపల్లి నరసింహ, చిట్టిమల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.