Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి అభివృద్ధి పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కంచర్ల
నవతెలంగాణ-నల్లగొండ డెస్క్
నల్లగొండ పట్టణం అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా చేపట్టిన రహదారుల విస్తరణ, అభివృద్ధి, మీడియన్, స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టీ.వినరు కృష్ణారెడ్డి అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. సోమవారం స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పట్టణంలో అభివృద్ధి పనులు పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పట్టణంలో ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి 6 కోట్ల వ్యయంతో చేపట్టిన వరద కాల్వ పనులకు శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ టీి.వినయ్ కృష్ణారెడ్డి శంఖుస్థాపన చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో మహిళా ప్రాంగణం నుండి ఔట్ డోర్ స్టేడియం వరకు, 2 కోట్లతో సాగర్ రోడ్ నుండి గంధం వారి గూడెం కుంట వరకు, 2 కోట్లతో ఎల్ఎస్.గుట్ట నుండి బక్కతాయి కుంట వరకు చేపట్టిన వరద కాల్వ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం తొలుత మర్రిగూడ బైపాస్ వద్ద నిర్మించ నున్న ఫ్లై ఓవర్ పై ఆర్ అండ్ బీ అధికారులతో చర్చించి సూచనలు చేశారు. మర్రి గూడ బైపాస్ నుండి క్లాక్ టవర్ వరకు రహదారి అభివృద్ధి పనులు, మీడియన్, ఫుట్ పాత్ పనులు పరిశీలించారు.హైద్రాబాద్ రోడ్ మానస విహార్ వద్ద మురుగు నీరు పోయేందుకు డ్రైన్ నిర్మాణం చేయాలని స్థానికులు కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలు తెలిపారు. ఐటీ టవర్ నిర్మాణ పనులు, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు పరిశీలించారు. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఎలివేషన్ పనులు పై సూచనలు చేశారు. ఎన్జీ కళాశాల నూతన భవన నిర్మాణ పనులు పరిశీలించారు. స్థానిక శాసన సభ్యులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలు సూచనల మేరకు, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో పట్టణంలో సుమారు 1400 కోట్ల వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. కళాభారతి నిర్మాణం, ఉదయ సముద్రం ట్యాంక్ బండ్, శిల్పారామం, వల్లనరావు చెరువు అభివృద్ధి పనులు, మెడికల్ కళాశాల పనులు చేపట్టినట్లు తెలిపారు. మార్చిలోగా రహదారి అభివృద్ధి విస్తరణ పనులు ప్రారంభం కళాభారతి, ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ పనులకు మంత్రి కెేటీఆర్ ద్వారా శంకుస్థాపన చేసే దిశగా పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైధి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ.రమణాచారి, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.