Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను వెంటనే మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ కోరారు. సోమవారం స్థానిక విజేత డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్మెంట్ట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించా లేకపోతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలగాని వెంకటేష్ గౌడ్, ఎన్ఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు హరినాయక్, విజేత కాలేజీ ప్రెసిడెంట్ నవీన్, శివ, సుభాష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.