Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్ లో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బుర్రు అనిల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్కాలర్ షిప్స్, ఫీజురీయింబర్స్‌మెంట్ రూ. 4వేల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. విద్యార్థులు స్కాలర్షిప్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారనిన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. అదేవిధంగా కొఠారి కమిషన్ ఇచ్చిన కేంద్ర బడ్జెట్లో 10శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30శాతం నిధులు కేటాయించాలని చేసిన సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘంజిల్లా ఉపాధ్యక్షులు పల్లె శివ,సహాయ కార్యదర్శి లు చింతల శివ, కాసుల నరేష్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు,జిల్లా కమిటీ సభ్యులు బర్రె రాజు,మేకల జలందర్, ఈర్ల రాహుల్ పాల్గొన్నారు.