Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3న మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నా
- 9 న చలో హైదరాబాద్
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లునాగార్జున్రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
సొంత స్థలం కలిగిన పేదలందరికీ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ రూ.5 లక్షలివ్వాలని ఫిబ్రవరి మూడో తేదీన మున్సిపల్ కార్యాలయాల ముందు జరుగు ధర్నాలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక ఎంవీఎన్ భవన్లో కెేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి అధ్యక్షతన ప్రజా సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లాలో అనేకమంది పేదలు ఇండ్లు, స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చడం లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వడంలో విఫలమైందన్నారు.జిల్లాలోని అనేక గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగిన పంపిణీ చేయకపోవడం దుర్మార్గమన్నారు.సొంత స్థలం కలిగిన ప్రజలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు.జిల్లావ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈనెల మూడో తేదీన జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల ముందు ధర్నాలు,తొమ్మిదో తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు, గిరిజనసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవినాయక్,పట్నం జిల్లా కన్వీనర్ జే.నర్సింహారావు, ఐద్వా జిల్లా కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ,గీతకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుగూరి గోవింద్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్వర, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి,సీఐటీయూ జిల్లా నాయకులు మేకనబోయిన శేఖర్,ఎం. ముత్యాలు,సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాంబాబు,జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, డీివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్, ఆవాజ్ జిల్లా కార్యదర్శి జహంగీర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వినోద్, గిరిజనసంఘం జిల్లా అధ్యక్షులు బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.