Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు
నవతెలంగాణ-దామరచర్ల
రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు డిమాండ్ చేశారు.దామరచర్లలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులకు రెండో రోజైన మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.విద్యార్థి అమరవీరుల త్యాగాలు వృథా కాకుండా ఉండాలంటే విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి, ప్రభుత్వ విద్యాసంస్థలనూ బలోపేతం చేసేందుకు కషి చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో బకాయిలో ఉన్న స్కాలర్ షిప్లు, ఫీజురీయీంబర్స్మెంట్కు రూ .3300కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.వివిధ కోర్సులు అయిపోయి పై చదువులకు వెళ్లాలంటే ఆయా కళాశాలల యాజమాన్యాలు తమకు ఫీజు రీయీంబర్స్మెంట్ రాలేదన్నారు.ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే విద్యా రంగానికి 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు -మనబడి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి కావాలంటే, బంగారు తెలంగాణ రాష్ట్రంలో బంగారు భవిష్యత్తు కలిగిన విద్యార్థులకు బడ్జెట్లో నిధులు కేటాయించి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరారు.పేద మధ్యతరగతి ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఆదర్శ పాఠశాలలో కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు.కొత్తగా ఏర్పడిన అన్ని రకాల గురుకుల పాఠశాలలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ఇవాళ రాష్ట్రంలో నూతన కలెక్టర్ ఆఫీసులు,పోలీస్ కార్యాలయాలతో పాటు పేద,మధ్యతరగతి విద్యార్థుల చదువులపై దృష్టి పెట్టాలంటే బడ్జెట్ అధికంగా కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుందన్నారు.రాష్ట్రంలో నిత్యం సంక్షేమరంగంలో ముందున్నామని చెప్పుకునే సీఎంకు సంక్షేమ వసతిగృహాల విద్యార్థుల సమస్యలు పట్టించు కోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.సంక్షేమ వసతి గహాల్లో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్,కాస్మోటిక్ చార్జీలు పెంచాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన విద్యార్థులకు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అందుకే జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయి ంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5వరకు అనేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చామన్నారు.అయినా బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి అన్యాయం జరిగితే ప్రభుత్వం పై బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చ రించారు.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి వినోద్నాయక్, యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు నాగమణి, మాజీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీను, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్,ఖమ్మంపాటి శంకర్, జిల్లా సహాయ కార్యదర్శి కొర్రా సైదా, కొర్రా రమేష్, రేణుక, బుడిగ వెంకటేష్, రమేష్, లక్ష్మణ్, జగన్, వీరన్న, ఉపేందర్, సూర్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.