Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్మహారాజ్
నవతెలంగాణ-నూతనకల్
తెలంగాణలో బహుజనులైన బీసీ,ఎస్సీ,ఎస్టీ ప్రజలకు రాజ్యాధికారమే ధ్యేయమని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా,విశారదన్ మహారాజ్ అన్నారు.మంగళవారం మండలపరిధిలోని తాళ్లసింగారం, ఎడవెల్లి, నూతన్ కల్, రామలింగాపూర్ గ్రామాలకు చేరుకొని, పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేరుకున్న సందర్భంగా డిఎస్పి జెండాలు, శిలా పలకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ అణగారిన అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం అందించడానికి స్వరాజ్య పాదయాత్ర చేపట్టినట్లుగా వివరించారు. ఇప్పుడున్నది మన రాజ్యం కాదని ఇది భూస్వాములు, ధనవంతులు ఇంకా చెప్పాలంటే అగ్రకుల రెడ్డి వెలమ దొరల రాజ్యమని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బలి అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీలు అయితే 10శాతం లేని రెడ్డి వెలమ కులాలు తెలంగాణను పరిపాలించడం ఏమిటని 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు కదా ఈ రాష్ట్రాన్ని పాలించడానికి నిజమైన అర్హులన్నారు. అందుకే వేలాది గ్రామాల్లో వందలాది మండలాల్లో పేద వర్గాలకు భారత రాజ్యాంగ హక్కులు, రాజకీయ విద్యను నేర్పి ఓటు చైతన్యాన్ని స్వరాజ్య భావ జాల వ్యాప్తి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ,,,,, ఈ కార్యక్రమంలో డిఎస్పి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్, జిల్లా నాయకులు శ్రీనివాస్, బాలు, రాము, భాస్కర్, జమదగ్ని, సురేష్, ప్రవీణ్, మధు తదితరులు పాల్గొన్నారు.