Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, వ్యాపారరంగంలో అడుగుపెట్టి, అంచెలంచెలుగా ఎదిగి తన వ్యాపారాన్ని విస్తరించి వేలాదిమందికి ఉపాధి కల్పించిన మీలా సత్యనారాయణ జీవితం నేటి యువతకు ఆదర్శమని సుధాకర్ పీవీసీ సంస్ధల ఎండి మీలా సత్యనారాయణ కుమారుడు మీలా మహదేవ్ అన్నారు. మీలా సత్యనారాయణ 92వ జయంతి వేడుకలను మంగళవారం స్థానిక శాంతినగర్ మారుతి విద్యా మందిర్లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మారుతి విద్యామందిర్ ప్రిన్సిపాల్ శ్రీలతరెడ్డి మాట్లాడుతూ మీలా సత్యనారాయణ స్ధాపించిన మారుతివిద్యామందిర్ ద్వారా వేలాది మంది విద్యార్థులు ఉచితంగా విద్యనభ్యసిం చారన్నారు.తమ పాఠశాలలో 500 మంది విద్యార్థులు చదువుతున్నారని, సుధాకర్ పీవీసీ సంస్ధల ద్వారా విద్యార్థులకు ఉచితంగా హాస్టల్ వసతి, బస్సు సౌకర్యం కల్పిస్తున్నారని వివరించారు.పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మీలా సత్యనారాయణ ధన్యజీవి అని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో మీలా మహదేవ్, విజయకుమారి దంపతులు, మీలా వాసుదేవ్, వీరమణి దంపతులు, మీలా జయదేవ్, నిర్మల దంపతులు, మీలా రవిశంకర్, పార్వతి దంపతులు, మీలా సందీప్, స్రవంతి దంపతులు, మీలా సంజరు,అనూష దంపతులు పాల్గొని మీలా సత్యనారాయణ, కమలమ్మలకు ఘనంగా నివాళులర్పించారు.గాంధీనగర్ సమీపంలోని తోటలోని మీలా సత్యనారాయణ దంపతుల విగ్రహాల వద్ద నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కేసీ మోహన్, కక్కిరేణి చంద్రశేఖర్, మారుతి స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలతరెడ్డి, సత్యనారాయణరెడ్డి, పాఠశాల సిబ్బంది, పాల్గొన్నారు.