Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.2,90,396 కోట్లలో 60 శాతం జనాభా ఉన్న బీసీలకు బిచ్చం వేసినట్లుగా కేవలం రూ.6220 కోట్ల కేటా యించడం సిగ్గుచేటని బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ విమర్శించారు.సోమవారం బడ్జెట్లో బీసీలకు అధికనిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ బీసీ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.సర్కారు కేటాయించిన నిధులతో బీసీలకు చారు, బిస్కెట్లు గిట్ల రావన్నారు.90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బడ్జెట్లో 50శాతం నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు.ఈ కార్యక్రమంలో భూక్యా బాలాజీనాయక్, నరాల సాయికుమార్‌యాదవ్, ముదిగొండ అరుణ్‌కుమార్, మానస, అరుణ, విజయలక్ష్మీ, మహేష్, వల్లాల రాజ్‌కుమార్, వినయ్, సురేందర్ పాల్గొన్నారు.