Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ : ప్రతిఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలేరు మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ అన్నారు. పురపాలక సంఘంలో సోమవారం స్థానిక గెస్ట్‌హౌస్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని,కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో అందరికీ ఉచితంగా ఈ సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. వైద్యాధికారులు ఇతర సిబ్బంది సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దిగ్విజయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి వెంకటేష్, కౌన్సిలర్లు సంఘ భూపతి, బేతి రాములు,గుత్త సమంతరెడ్డి, జిల్లా డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్, పట్టణ ప్రధానకార్యదర్శి పత్తి వెంకటేష్, గుజ్జ అశోక్, ముదిగొండ శ్రీకాంత్, ఆలేటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.