Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవతెలంగాణ- ఆలేరుటౌన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలందరి ఆశలు, ఆశయాలు పూర్తి స్థాయిలో నెరవేర్చేదిగా ఉందని ప్రభుత్వ విప్,ఆలేరు ఎంఎల్ఏ గొంగిడి సునితమహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆమె మాట్లాడుతూ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రజలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని కొనియాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,90,396 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజలందరి ఆశలు,ఆశయాలను పూర్తి స్థాయిలో నెరవేర్చేదిగా ఉందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి మరోసారి పెద్దపీట వేసిందని,ఇందులో భాగంగానే ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీల సంక్షేమానికి ,మహిళా శిశు సంక్షేమానికి,ఆసరా పింఛన్లకు ,కల్యాణలక్ష్మీ,షాదీ ముభారక్ పథకానికి అధిక బడ్జెట్ కేటాయించడం సంతోషదాయకం అన్నారు.శాంతిభద్రతలు సజావుగా ఉండటం,సుస్థిర రాజకీయ,పాలనా వ్యవస్థ కొనసాగుతుండటంతో దేశ విదేశాల నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయని చెప్పారు.కార్యశీలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారంజక పాలనకు, కేటీఆర్ ఆలోచనల తోడుతో దూరదృష్టి, పక్కా ప్రణాళికలతో తెలంగాణలో సాగునీరు, విద్యుత్, హరిత హరం, ఐటీ, ఫార్మా, మెడికల్, టూరిజం శాఖలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయని వివరించారు. 2023-24 వార్షిక బడ్జెట్ రైతన్నలు, నేతన్నలు, గీతన్నలు, విద్యార్థులు, యువత, మహిళలు, వికలాంగులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేదిగా ఉందని ప్రశంసించారు.