Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -బొమ్మలరామారం
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 12 నుండి 28 వరకు జనగామ జిల్లా పాలడుగు నుంచి అసెంబ్లీ వరకు జరిగే పాదయాత్రను కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని. సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి పాండు అన్నారు. మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం బాబు అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూరీ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయని, అనేక సంవత్సరాల నుండి అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలకు కులాలకు సంబంధించిన కార్మికులు పనిచేస్తున్నారని .గ్రామాలను పట్టణాలను పరిశుభ్రం చేసే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర ఉన్నదని తక్కువ వేతనాలు చెల్లిస్తూ వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని ప్రభుత్వాలు వెంటనే గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం చెల్లించాలని బకాయిలో ఉన్న మూడు నెలల వేతనం వెంటనే చెల్లించాలనిి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ర్యకల శ్రీశైలం ,గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా మండల నాయకులు సిద్ధంకి యాదగిరి, లక్ష్మీకాంత్ ,మైసయ్య ,సుధాకర్ ,బాలమణిి, పెంటమ్మ ,పుష్పమ్మ, ఎల్లమ్మ ,రాంబాయి ,శకుంతల ,తదితరులు పాల్గొన్నారు.