Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోత్కూర్ మార్కెట్ చైర్మెన్ యాకూబ్ రెడ్డి
నవతెలంగాణ-మోత్కూరు
తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రతిబింబించేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి అన్నారు మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలు మతాల ప్రజల సంక్షేమా న్ని ఆకాంక్షిస్తూ సమ ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలిచి కాపాడుకోవాలని కోరారు. కేవలం మాటలు చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్నామని, సీఎం కేసీఆర్ నిరంతర కృషితో బంగారు తెలంగాణగా మారుతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశం మొత్తం అమలు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ ద్వారా అది త్వరలోనే నెరవేరుతుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు ఎంత ఆరాటపడినా, ఎన్ని అభాండాలుడా వేసినా బీఆర్ఎస్ ను ఓడించే సత్తా వారికి లేదన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎవరు పరితపిస్తున్నది ప్రజలు గమనిస్తున్నారని, అందుకు అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిదర్శనమని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్న తీరును ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్లో చూపించారని, ప్రజా సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, నాయకులు సోలిపురం లక్ష్మీనర్సింహారెడ్డి, మెంట నగేష్, దేవరపల్లి నర్సిరెడ్డి, లగ్గాని యాదయ్య ఉన్నారు.