Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ-నల్గొండ
బడ్జెట్లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రైతు సంఘం 2023-24 రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూ.26,831 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ వ్యయ వాల్యూమ్ -2లో వ్యవసాయానికి రూ.20,890 కోట్లు మాత్రమే కేటాయించబడ్డాయని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి చెప్పిన పద్దు పరిశీలించిన అందులో రైతుల రుణ మాఫీకి రూ.6,385 కోట్లు కేటాయించారన్నారు. లక్ష రూపాయలలోపు రుణాలు మాఫీ చేస్తామని 2018 ఎన్నికల్లో హామి ఇచ్చారని కానీ ఈ నిధులతో రైతుల రుణాలు మాఫీ కావన్నారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో రైతులు డిఫాల్టర్లుగా మారారని కావున ఏకకాలంలో రుణమాఫీ నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. రైతుబంధుకు రూ.15,075 కోట్లు, రైతుబీమాకు రూ.1,589 కోట్లు కేటాయింపు చూపారని ఈ మూడు పద్దుల మొత్తం రూ. 23,049 కోట్లకు చేరుకుంది. ఇక మిగిలింది రూ.3,332 కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో పరిశోధనలకుగాని, ప్రకృతివైపరీత్యాల పరిహారం చెల్లింపుకుగాని, హార్టికల్చర్ అభివృద్దికిగాని పెద్దగా కేటా యింపులు లేదని తెలిపారు. అయిల్ ఫామ్ తోటల పేంపుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి లక్షల ఎకరాలలో వేయిస్తామని, రైతులకు 50 శాతం నుండి 90 శాతం రాయితీ ఇస్తామని ప్రకటన చేసి దానికి తగిన నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 171.20 లక్షల కాగా, వాస్తవంగా సాగైంది 194.86 లక్షల ఎకరాలు కాగా ఇందులో 82 శాతం సన్నచిన్నకారు రైతులున్నార నీ రైతు బంధు, రైతుబీమా మినహాయిస్తే మిగిలిన అంశాలకు కేటాయింపులు లేవన్నారు. రైతు బీమాను 18-59 నుండి 18-70 సంవత్సరాలకు వరకు పెంచాలని రైతు సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేశాయని కౌలు రైతులకు ఏ పథకం ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో ఆ ప్రతిపాధనలు లేవని ప్రకతి వైపరీత్యాల పరిహారాన్ని పూర్తిగా మినహాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వ్యవసాయ పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కల్తీ, నాణ్యతలేని విత్తనాల వలన ఏటా 4, 5 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతింటున్నాయని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని అన్నారు. పంటల బీమాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిపై పరిస్థితుల దృష్టా వ్యవసాయ బడ్జెట్ను రెట్టింపు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.