Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-చివ్వెంల
తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాల పరిరక్షణే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.పెద్దగట్టు జాతరలో పాల్గొన్న భక్తుల మొహల్లో కనిపిస్తున్న చిరునవ్వు ,ఆనందమే దానికి తార్కాణమన్నారు.మంగళవారం మంత్రి కుటుంబసమేతంగా పెద్దగట్టు జాతరకు హాజరయ్యారు.లింగమంతుల స్వామివారికి నిర్వహించిన చంద్రపట్నం,కల్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.కోట్ల రూపాయలను వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించడంతో భక్తులు చాలా సంతోషంగా స్వామివారిని దర్శించుకుంటున్నారని చెప్పారు.ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా భక్తులు జాతరలో పాల్గొన్నారని తెలిపారు..రేపు ఎల్లుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నదన్నారు.దానికి అనుగుణంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఆలయ కమిటీ సభ్యులు,ప్రభుత్వయంత్రాంగం, పోలీసులు సమిష్టిగా పని చేస్తూ,జాతరలో ఎలాంటి అసౌకర్యం లేకుండా రేయింబవళ్లు పని చేస్తున్నారని మంత్రి కితాబిచ్చారు.పాడి పంటలతో, సిరి సంపదలతో, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మరిందన్నారు .సీఎంకేసీఆర్ విజన్‌తో తెలంగాణ యావత్ దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు.లింగమంతుల స్వామివారి దయతో తెలంగాణ మరింత పురోగమించాలని ఆకాంక్షించారు.
జాతర కలియ తిరిగిన మంత్రి
అభిమాననేతతో సెల్ఫీ దిగేందుకు పోటీపడిన భక్తజనం
పెద్దగట్టులో పూజా కార్యక్రమాల అనంతరం జాతరలో కలియదిరిగారు.భక్తులను పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు.అభిమాన నేతతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు.దాదాపు రెండు గంటల పాటు ఓపికగా అందరితో సెల్ఫీలు దిగిన మంత్రిఅనంతరం పోలీసు కంట్రోల్ రూంను పరిశీలించారు.సీసీ కెమెరాల ద్వారా పోలీసు శాఖ చేపట్టిన నిఘా గురించి ఎస్పీరాజేంద్రప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు.తరువాత విద్యుత్, ఆరోగ్య, మున్సిపల్ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి ఉద్యోగులతో గ్రూప్ ఫొటోలు దిగారు.