Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు లేని నిరుపేద అసంఘటిత రంగ కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ప్రజాసంఘాల ఐక్య వేదికఆధ్వర్యంలో పేదల పక్షాన జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు.మంగళవారం స్థానికసీఐటీయూ జిల్లా కార్యాలంలో ఎం.రాంబాబు అధ్యక్షతన జరిగిన నియోజక వర్గ మండల కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ నెల 3వ తేదీన ఇండ్లు, స్థలాలు కోసం రెవెన్యూ అధికారులకు విన్నతిపత్రాలు ఇచ్చామన్నారు. తిరిగి 9న తెలంగాణ ప్రజా సంఘాల పోరాటవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలలో పేదలు పాల్గొనాలని కోరారు. జిల్లాలో ఇండ్లు లేని నిరుపేదలందరూ ఇండ్లస్థలాల కోసం ఇప్పటికే వేలాది మంది ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పరిస్థితి ఉన్నదన్నారు.స్వంత ఇండ్లు లేక, అద్దె చెల్లించలేక అనేక మంది అసంఘటిత రంగ కార్మికులు, హమాలీలు, ఆటో, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.రాష్ట్ర బడ్జెట్ పేదలను నిరుత్సాహపరిచిందన్నారు. సూర్యాపేట పట్టణంలో పారిశ్రామిక రంగం రోజురోజుకు పెరుగుతుందని 100 ఎకరాలలో కార్మిక గృహా సముదాయం నిర్మించాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు శ్రామిక మహిళా కన్వీనర్ యాక లక్ష్మీ, ఎం.శేఖర్, రణపంగి కృష్ణ, యాతాకుల వెంకన్న, సాయికుమార్, కొండేటి ఉపేందర్, గంధమల్ల సోమన్న, తదితరులు పాల్గొన్నారు.