Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ప్రేమ దేశం'. శ్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై శిరీష సిద్ధం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2న ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించనున్న అలనాటి నాయిక మధుబాల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
'ఈ పాత్రను నా కోసమే రాశానని దర్శకుడు అన్నారు. నేను ముందు నో చెప్పాను. కానీ పదే పదే నన్ను కలవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇన్నిసార్లు ప్రయత్నాలు చేస్తున్నారు కదా అని నేను కూడా చేయాలని ఫిక్స్ అయ్యా. తల్లీకొడుకుల రిలేషన్ చాలా చక్కగా చూపించారు. 'ప్రేమ దేశం' అనే టైటిల్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలోని మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో నేను కూడా ఒక హీరోయిన్లాంటి పాత్రలోనే కనిపిస్తాను. నేను బయట చాలా ఫన్నీగా ఉంటాను. అయితే ఈ సినిమాలో నా పాత్ర కామెడీ యాంగిల్లో ఉండదు. త్రిగుణ్ నాకు అదిత్లానే తెలుసు. ఫస్ట్ సీన్ అతనితోనే ఉంది. కొత్త దర్శకుడు, కొత్త కథ ఎలా కలిసిపోవాలని అనుకుంటూ ఉన్నాను. అదిత్ పర్ఫామెన్స్ చూసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎంతో సహజంగా నటించేశాడు. మేఘా అయితే స్వీట్, యాక్టివ్ పర్సన్. ఈ మధ్యే నేను ఒక తెలుగు సినిమాను పూర్తి చేశాను. 'గేమ్ ఆన్' అనే చిత్రం అద్భుతమైన కథతో రాబోతోంది. ఇప్పుడు తెలుగులో పని చేస్తేనే ఎక్కువ రీచ్ వస్తుంది. అందుకే నేను తెలుగు సినిమాల మీద ఫోకస్ పెట్టాను. 'రోజా, జెంటిల్మెన్, అల్లరి ప్రియుడు, అన్నయ్య, యోధ' ఇలా కొన్ని చిత్రాల్లో నాకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం హిందీలో 'కర్తమ్ హుక్తమ్' అనే సినిమాను సోనమ్ షాతో కలిసి చేస్తున్నాను. మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. జీ5లో ఓ వెబ్ సిరీస్, వివేక్ శర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాను. పెద్ద సినిమాలు, నెగెటివ్ రోల్స్ చేయాలని అనుకుంటున్నాను. అలాగే ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయాలని ఉంది' అని మధుబాల అన్నారు.