Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఆంథాలజీ 'మీట్ క్యూట్'. నాని సోదరి దీప్తి గంటా ఈ ఆంథాలజీతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఆంథాలజీ ఈనెల 25న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో 'మీట్ క్యూట్' ప్రీ స్ట్రీమింగ్ సెలెబ్రెషన్స్ గ్రాండ్‌గా జరిగాయి.
హీరో నాని మాట్లాడుతూ, 'ఇది చాలా క్యూట్ ఆంథాలజీ. మీ అందరూ చాలా బాగా ఎంజారు చేస్తారనే నమ్మకం ఉంది. ఇందులో ఐదు కథలు ఉన్నాయిజ 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' కథలో సత్యరాజ్, రుహాని శర్మ చాలా అద్భుతంగా చేశారు. ఇందులో చాలా లైఫ్ లెసన్స్ ఉన్నాయి. సందేశంలా కాకుండా చాలా చిన్న విషయాలను చాలా సెటిల్డ్‌గా, అందంగా ప్రజంట్ చేసిన కథ ఇది. 'ఎక్స్ గర్ల్ ఫ్రెండ్' కథలో సంచిత, జిపి, సునయన చాలా బ్యూటీఫుల్‌గా చేశారు. వీరి పాత్రలను అందరూ రిలేట్ చేసుకుంటారు. ఒక షాకింగ్ ట్విస్ట్ కూడా ఉంది. 'స్టార్‌స్ట్రక్'లో అదా, శివ చాలా క్యూట్‌గా ఫెర్ఫార్మ్ చేశారు. ఇది నా ఫేవరేట్ కథలలో ఒకటి. అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. 'మీట్ ది బారు'లో వర్ష, అశ్విన్ కథ చాలా స్పెషల్. ఇందులో మా పిన్ని, అంజు కూడా డబ్బింగ్ చెప్పింది. నేను అక్కని పరిచయం చేస్తే, అక్క మా ఫ్యామిలీని పరిచయం చేస్తోంది. ఈ కథలో చాలా బ్యూటీఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. 'ఇన్ లా'కథలో రోహిణి, ఆకాంక్ష, దీక్షిత్ చేశారు. కాబోయే అత్తా కోడలికి మధ్య జరిగే క్యూట్ కథ. అక్క చాలా అందంగా రాసింది. అంతే అందంగా వీళ్ళు ఫెర్ఫార్మ్ చేశారు. చాలా మంచి కంటెంట్ ఉన్న ఆంథాలజీ ఇది. నేను నా పనిని ప్రశాంతంగా చేయగలుగుతున్నా అంటే కారణం ప్రశాంతి నాకిచ్చిన నమ్మకం. విజరు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అక్కని చూస్తే చాలా గర్వంగా ఉంది. చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసింది. మీకు చాలా హాయినిచ్చే ఆంథాలజీ ఇది' అని తెలిపారు.
'నాని లేకుండా ఈ ప్రాజెక్ట్ లేదు. నాని లేకపోతే నేను దర్శకురాలిని అయ్యేదాన్నే కూడా కాదు. ప్రశాంతి నాపై ఎంతో నమ్మకం ఉంది ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. కథే ఇందులో హీరో. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్. వసంత వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఎడిటర్ గ్యారీ గ్రేట్ వర్క్ అందించారు. విజరు చాలా అందమైన మ్యూజిక్ ఇచ్చారు. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అవినాష్ వండర్ ఫుల్ ఆర్ట్ వర్క్ చేశారు' అని దర్శకురాలు దీప్తి గంటా అన్నారు.