Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. ఎన్‌సి 22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. నాగ చైతన్య కెరీర్‌లోని అత్యంత భారీ చిత్రాల్లో ఈ ప్రాజెక్ట్ ఒకటి.
తారాగణం పరంగా, అద్భుతమైన సాంకేతిక విభాగ ప్రకటనతో ఈ చిత్రం భారీ బజ్‌ని క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ స్టన్నింగ్ ప్రీ లుక్‌తో అభిమానులను, సినీ ప్రేమికులను సర్ప్రైజ్ చేశారు. ప్రీ-లుక్‌లో నాగ చైతన్య పోలీస్ అవతార్‌లో ఫెరోషియస్ లుక్‌లో కనిపించారు. ఆయన తన తోటి అధికారుల చేతుల్లో లాక్ అయినట్టు కనిపిస్తున్నారు. ఆయన ఆవేశాన్ని అదుపు చేయడానికి తుపాకీలను కూడా గన్స్ గురిపెట్టిన ఈ ఇంటెన్స్ లుక్ చిత్ర ఫస్ట్ లుక్ పై అంచనాలను పెంచింది. ఫస్ట్ లుక్‌ను ఈనెల 23వ తేది ఉదయం 10:18 గంటలకు చైతన్య పుట్టినరోజు సర్ప్రైజ్గా విడుదల కానుంది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తండ్రీతనయులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తుండగా, అబ్బూరి రవి డైలాగ్స్, ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.