Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం 'గాలోడు'. గెహ్నా సిప్పి హీరోయిన్. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల స్వీయ దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా బ్లాక్బస్టర్ అవ్వడంతో మేకర్స్ సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ''గాలోడు' సక్సెస్ ఏ ఒక్కరిదో కాదు.. టీం అందరిది. అందరికీ మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా. కథ రాయడం, సినిమా తీయడం, ప్రొడక్షన్ చేయడం ఈజీనే. కానీ సినిమాను రిలీజ్ చేయడమే చాలా కష్టం. మాకు సపోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ జనార్థన్కి థ్యాంక్స్' అని అన్నారు.'ఈ సినిమాకు పెట్టిన ప్రతీ రూపాయి వెనక్కి వచ్చాకే సక్సెస్ మీట్ పెడదామని అన్నాను. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరిది ఈ విజయం. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్. సినిమాను ఆదరించిన తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు' అని హీరో సుడిగాలి సుధీర్ చెప్పారు.