Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల వేడుకను నిర్వహించేందుకు సంతోషం పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి సన్నాహాలు చేస్తున్నారు. ఈ అవార్డుల కార్యక్రమం గురించి ఆయన మాట్లాడుతూ, 'తెలుగు సినిమాలకు గత 20 ఏళ్లుగా అవార్డులు అందిస్తున్న 'సంతోషం' వారపత్రిక ఆధ్వర్యంలో 21వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 వేడుకలు డిసెంబర్ 26న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. సౌత్ ఇండియాలోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నాం. ఈ ఏడాది కూడా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషాచిత్రాలకు అవార్డులు అందజేస్తాం. ఈసారి అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్గా జరగనున్న ఈ వేడుకల్లో పలువురు తారల డ్యాన్స్, కామెడీ, హంగామాతో ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది' అని చెప్పారు.