Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినీ పరిశ్రమలోని నటీ నటులతో పాటు వివిధ శాఖలలోని ప్రతిభా వంతులకు 'టీఎఫ్‌సీసీ- నంది అవార్డ్స్' ద్వారా తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ గుర్తింపు ఇవ్వనుంది. రాబోయే ఉగాది పండుగ రోజున భారీ స్థాయిలో ఈ అవార్డుల వేడుకను నిర్వహించనుంది.
ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ, ''టీఎఫ్‌సీసీ -నంది సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్ 2020-22' కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్‌లాల్, యష్, చిరంజీవిని కలిసి ముఖ్య అతిథులుగా హాజరై, దీన్ని విజయవంతం చేయాలని కోరాం. దీనికి తమ వంతు సహకారాన్ని అందజేస్తామని చెప్పారు. విశేష ఆదరణ పొందిన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషా చిత్రాలకు ఈ అవార్డులను అందజేస్తాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం సహకారం, మరింత తోడ్పాటును అందజేయాలని ఇటీవల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిశాం' అని అన్నారు.