Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా 'కిడ'. గోవాలో ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది.
ఇఫీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం ఓ విశేషమైతే, థియేటర్లో ఈ చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ లభించడం మరో విశేషం.
'కిడ'లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో 'స్రవంతి' రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'దర్శకుడికి తొలి సినిమా అయినా బాగా తీయగలడని, కథకు న్యాయం చేస్తాడనే నమ్మకంతో అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. అతడు స్క్రిప్ట్ ఏదైతే రాశాడో అదే తెరపైకి తీసుకొచ్చాడు. అందుకే, ఇవాళ ఇన్ని ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమాకు భాషాపరమైన ఎల్లలు, హద్దులు లేవు. మంచి సినిమా వస్తే సబ్ టైటిల్స్‌తో కూడా చూస్తారు. అందుకనే, తమిళంలో తీశా. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం' అని అన్నారు 'యంగ్ జనరేషన్ ఈ సినిమాకి కనెక్ట్ అవ్వరని అనుకున్నా. కానీ, వాళ్ళు సీన్ టు సీన్ చెబుతుంటే సంతోషంగా ఉంది. నా బాల్యంలో జరిగిన సంఘటనల స్పూర్తితో తీశాం. ఈ రోజు సినిమా ఈ స్థాయికి వచ్చిందంటే కారణం మా నిర్మాత స్రవంతి రవికిశోర్' అని చిత్ర దర్శకుడు ఆర్ఏ వెంకట్ తెలిపారు.