Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రానికి 'కస్టడీ' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 'ఎ వెంకట్ ప్రభు హంట్' అనేది ట్యాగ్‌లైన్.
తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. బుధవారం నాగచైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో నాగ చైతన్య ఫెరోషియస్‌గా కనిపిస్తున్నారు.
నిజాయితీ, దృఢ నిశ్చయంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎ. శివ పాత్రలో, అతను చూడాలనుకునే మార్పు కోసం అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడతాడని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. తాను నమ్మే విధానం కోసం తన స్వంత వ్యవస్థతో శివ పోరాటం చేస్తాడని ఫస్ట్‌లుక్‌లో స్పష్టమౌతోందని చిత్ర యూనిట్ పేర్కొంది.