Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'వీరసింహారెడ్డి'. రాబోయే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ఏకధాటిగా జరుగుతోంది.
ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'జై బాలయ్య' ఈనెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా 'రాజసం నీ ఇంటి పేరు' అని పేర్కొంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో బాలకృష్ణ లుక్ ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేస్తోంది. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రం కోసం 'జై బాలయ్య' అంటూ మరో మాస్ నంబర్‌ను స్కోర్ చేశారు. నందమూరి అభిమానులకు ఇది మరో బొనాంజా అని మేకర్స్ అన్నారు.
శతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు.