Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్.రవీంద్ర) కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేర్ వీరయ్య'. బుధవారం ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'బాస్ పార్టీ'ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుతూ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను కంపోజ్ చేసి, ఆయనే రాసి, పాడారు. బాస్ పార్టీ డీఎస్పీ స్టయిల్లో మాస్ మసాలా నంబర్. నకాష్ అజీజ్, హరిప్రియ డైనమిక్‌గా పాడిన ఈ పాటకు దేవిశ్రీ ర్యాప్ డబుల్ ఎనర్జీ జోడించింది. డీఎస్పీ ట్రాక్ లైవ్లీగా ఎంటర్ టైనింగ్‌గా ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా మెస్మరైజ్ చేస్తోంది. చిరంజీవి తన అద్భుతమైన డాన్సుతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఊర్వశి రౌతేలా చిరంజీవి ఎనర్జీని అందుకోవడానికి ప్రయత్నించి విజయం సాధించింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం తెలిపింది.