Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ నటిస్తున్న తాజా సినిమా 'హిట్ 2'. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్. డిసెంబర్ 2న ఈ సినిమా రిలీజ్ కానుంది. బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ, 'హిట్ యూనివర్స్‌లో రెండో పార్ట్ చాలా కీలకం. హిట్ 3లోనూ నేను ఉన్నాను. ప్యాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయండని నార్త్ ఆడియెన్స్ అడుగుతున్నారు. అందుకే నానితో మాట్లాడి.. పాన్ ఇండియన్ రేంజ్లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం. అన్నపూర్ణలో రెండు చిత్రాలు చేయబోతోన్నాను. అవి కూడా పాన్ ఇండియన్ సినిమాలే. ఈ ట్రైలర్ కట్ చేసేందుకు చాలా ఆలోచించాం. ప్రతీ షాట్, ప్రతీ ఫ్రేమ్, డైలాగ్‌కు అర్థం ఉంటుంది' అని తెలిపారు.
'సినిమా మూడ్ ఏంటో చెప్పేందుకు ట్రైలర్‌ను ఇలా కట్ చేశాం. ఇలాంటి క్రైమ్‌ను చూపిస్తున్నప్పుడు స్టైల్ అని చూపించడం లేదు. చెడు మీద ఓ మంచి ఎలా గెలుస్తుందనేది చూపించాం. సమాజంలో జరిగే దానికి ప్రతీకగానే సినిమాలు ఉంటాయని దిశా, శ్రద్దా వాకర్ ఘటనలు నిరూపిస్తున్నాయి. అలాంటి సైకోలకు సినిమాలే స్పూర్తి అని చెప్పలేం. మంచికి స్పూర్తిలా ఉండేలానే సినిమాలు తీస్తాం. హిట్ 3ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. నాని అనుభవాన్ని ఈ స్క్రిప్ట్ విషయంలో నేను వాడుకున్నాను' అని దర్శకుడు శైలేష్ కొలను చెప్పారు.