Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం 'మణిశంకర్'. డబ్బు చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన కథాకథనాలతో, యాక్షన్ ఎలిమెంట్స్‌తో డిఫరెంట్ మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని జి.వి.కె(జి. వెంకట్ కష్టణ్) నిర్వహించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. మీడియా సమావేశంలో హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ, 'సినిమా బాగా వచ్చింది. ఇందులో ఓ ఫిలాసఫీ కూడా ఉంటుంది. జనవరి మొదటి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాం' అని తెలిపారు.
'పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పాటలు, ఫైట్స్ కూడా కథలో భాగంగానే వస్తాయి. రెండు గంటలు కచ్చితంగా ఎంజారు చేస్తారు' అని డైరెక్టర్ జి. వెంకట్ కష్టణ్ అన్నారు. సంజన గల్రానీ మాట్లాడుతూ,'శివ కంఠమనేని చక్కగా నటించారు. మా నిర్మాతలు చాలా మంచి వారు. చక్కటి ప్లానింగ్‌తో సినిమా నిర్మించారు' అని చెప్పారు.