Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ, అమ్ము అభిరామి, చాందిని రావు, సమ్మెట గాంధీ నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం 'రణస్థలి'. ఈ నెల 26న గ్రాండ్ విడుదలకు సిద్దమైన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో రిలీజ్ చేస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి నిర్మాత అశ్వినిదత్, హీరోలు ఆకాష్ పూరి, నందు, గౌతమ్‌తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ, 'విజయ పిక్చర్స్ అధినేత వెంకటరత్నం ఆ సంస్థను చాలా సక్సెస్‌ఫుల్‌గా 50 సంవత్సరాలు నడిపిన గౌరవ ప్రదమైన వ్యక్తి. వారి అబ్బాయి విష్ణు విజయవాడలో కన్స్ట్రక్షన్ బిజినెస్ రంగంలో ఎంతో పేరు తెచ్చుకొని, ఇప్పుడు సినిమా రంగంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. తను తీసిన ఈ సినిమా ట్రైలర్, టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే 'ఇంద్ర' సినిమా గుర్తుకు తెస్తుంది. దర్శకుడు, కెమెరామెన్ ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారు. నటీనటులు కూడా బాగా నటించారు. ఈ సినిమా హిట్ అవుతుంది' అని అన్నారు.