Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'లవ్ టుడే'. ఇవాన హీరోయిన్. తమిళంలో విడుదలైన ఈ చిత్రం ఫన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేశారు. తెలుగునాట కూడా ఈ చిత్రం విశేష ఆదరణ పొంది, సూపర్‌హిట్ టాక్‌తో కలెక్షన్లను వసూలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ, 'తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ మా సినిమాకి ప్రేక్షకుల రెస్పాన్స్ సూపర్‌గా ఉంది. దిల్ రాజుగారితో కలిసి పని చేయటం ఆనందంగా ఉంది. నేటి తరం సెల్ఫోన్లను ఎలా వాడుతున్నారు అనే పాయింట్‌కి అందరూ బాగా కనెక్ట్ అవుతున్నారు. హీరో, హీరోయిన్లు తమ సెల్ ఫోన్లను మార్చుకున్న దగ్గర్నుంచి సినిమా అయిపోయేంతవరకు ప్రేక్షకులు నవ్వుతూనే ఉన్నారు' అని చెప్పారు.