Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం 'ఏపి 04 రామాపురం'. అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్ర టైటిల్, మోషన్ పోస్టర్లను ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు అవిష్కరించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రసాద్ లాబ్స్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, జెస్సితో పాటు నటుడు పృథ్వి పాల్గొన్నారు.
నటుడు పృథ్వి రాజ్ మాట్లాడుతూ, 'డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి' అని తెలిపారు.
'19 ఏళ్ళ వయసులో ఈ సినిమా రాయడం స్టార్ట్ చేశాను. 23 ఏళ్లకు డైరెక్షన్ చేశాను. సినిమా ఇండిస్టీలో సపోర్ట్ ఉండదు అంటారు. కానీ నా సినిమా కోసం ఇంతమంది వచ్చి ఎంకరేజ్ చేశారు. అందరికీ థ్యాంక్స్' అని దర్శకుడు హేమ రెడ్డి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ, 'చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా మా సినిమాను ఎంకరేజ్ చేయటానికి వచ్చిన మీ అందరికి చాలా పెద్ద థ్సాంక్స్' అని చెప్పారు.