Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం 'మసూద'.
సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా ఈ సినిమా ప్రదర్శితమవుతున్న సందర్భంగా రామానాయుడు స్టూడియోలో థ్యాంక్యూ మీట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ,'రాహుల్ యాదవ్ టేస్ట్‌కు తగ్గట్టు కథను, దర్శకుడు గౌతమ్‌ను సెలెక్ట్ చేసుకొని ''మళ్ళీ రావా'' సినిమా చేసి హిట్ కొట్టాడు. ఆ తరువాత 'ఏజెంట్ ఆత్రేయ' సినిమా తీసి మళ్ళీ హిట్ కొట్టి, ఇప్పుడు దర్శకుడు సాయికిరణ్‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టడం అనేది గ్రేట్. మంచి సినిమాలకు సీజన్ అంటూ ఉండదు. ఇలాంటి మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా మళ్ళీ ప్రూవ్ చేసింది' అని తెలిపారు.
'ఈ బ్యానర్లో మెదటి సినిమా 'మళ్ళీ రావా' చేశాను. ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. చాలా రోజుల తర్వాత రియలిస్టిక్ హర్రర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హ్యాట్రిక్ హిట్ సాధించిన రాహుల్‌కు కంగ్రాట్స్' అని హీరో సుమంత్ అన్నారు.
నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ, 'ఈ సినిమా విడుదలైన మూడవ వారంలో కూడా మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్. నాకు స్ఫూర్తి మా నాన్నే. 'మళ్ళీ రావా', 'ఏజెంట్ ఆత్రేయ' సినిమాలు బిగ్ హిట్ అయిన తరువాత నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్న టైమ్‌లో 'మసూద' లాంటి స్క్రిప్ట్ ఇచ్చిన సాయికి బిగ్ థ్యాంక్స్' అని చెప్పారు. చిత్ర దర్శకుడు సాయికిరణ్ మాట్లాడుతూ,'ఏ సినిమాకైనా కథతో పాటు మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా అవసరం. అలాంటి వాళ్ళందర్నీ నిర్మాత రాహుల్ నాకు ఇచ్చారు. సినిమాని బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్' అని అన్నారు.