Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన ్మెంట్స్ బ్యానర్లపై రూపొందిన చిత్రం 'గుర్తుందా శీతాకాలం'.
సత్యదేవ్, తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని నటించారు. కన్నడ డైరెక్టర్ నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మించారు.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈనెల 9న గ్రాండ్‌గా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తున్న సందర్భంగా నాయిక తమన్నా మీడియాతో ముచ్చటించారు.
- ఈ సినిమాను గీతాంజలి సినిమాలో పోలుస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక క్లాసిక్ సినిమాతో మా సినిమాను పోల్చినపుడు ఆ అంచనాలను మేం రీచ్ అవుతామనే నమ్మకంతో ఉన్నాం.
- రీమేక్ సినిమాలో నటించడం అనేది నాకు కొత్త కాదు. కానీ ఒరిజినాలిటీని మిస్ కాకుండా ఛాలెంజ్‌లా తీసుకుని చేస్తాను. ఎందుకంటే వాళ్లు అప్పటికే క్యారెక్టర్స్ చేసి ఉంటారు కాబట్టి చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఆ క్యారెక్టర్ చేయడాన్ని సవాల్‌గా తీసుకుంటాం.
- మిగతా సినిమాలతో చూస్తే లవ్ స్టోరీస్‌లో నటించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కొంచెం కష్టమే. కానీ ఈ సినిమాలో నా ఎమోషన్స్, క్యారెక్టరైజేషన్ అందర్నీ ఆకట్టుకుంటాయి. సినిమాను పోలిన సినిమాలు వస్తుంటాయి. కానీ అందులో ఏదో కొత్త పాయింట్ ఉంటుంది. ఇందులో కూడా కొత్త ఎమోషన్స్, కొత్త పాయింట్‌ను ప్రేక్షకులకు చెప్పబోతున్నాం.
- సత్యదేవ్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది. తను నటించిన 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ చాలా నేచురల్‌గా అనిపించి, ఆయనతో నటించాలనే ఇంట్రెస్ట్ కలిగింది. ఆ తర్వాత ఈ సినిమా ఆఫర్ రావడంతో ఆ కోరిక తీరింది. హీరోల్లో పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడాలు చూడను. ఎవరితోనైనా నేను సినిమాని సినిమాగానే చూస్తాను. అయితే సినిమా కథ బాగుండాలి, ఆ సినిమా ఆడియన్స్‌కు నచ్చాలని కోరుకుంటాను.
- నేను ఇండిస్టీకి వచ్చి 17 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు నాకు సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాపై నాకు ఎలాంటి ప్యాషన్ ఉందో, ఇప్పుడూ అదే ప్యాషన్‌తో ఉన్నాను. ప్రస్తుతం చిరంజీవితో 'భోళాశంకర్' ప్రాజెక్ట్ చేస్తున్నాను. అలాగే ఓటీటీలో మూడు ప్రాజెక్ట్స్, మలయాళంలో మొదటి సారిగా 'బాంద్రా' సినిమా చేస్తున్నాను. ఈ సినిమతో మలయాళ ఇండిస్టీకి పరిచయం అవుతున్నాను.
నా పెళ్ళి ఎప్పుడూ అని అందరూ అడుగుతున్నారు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు చేసుకుంటావ్ అని అడుగుతున్నారు. వాళ్ళకైతే మంచి సంబంధం చూడమని చెప్పాను. కానీ నాకు ఇప్పుడప్పుడే చేసుకోవాలని లేదు. అలాగే నా గురించి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌ని, పుకార్లని అస్సలు పట్టించుకోను.