Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హృషీకేష క్రియేషన్స్, భీష్మా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్, శ్రావ్య (తొలిపరిచయం) జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉత్తమ విలన్'. వి.సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి.శ్రవణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ చిత్ర టీజర్ బాగుంది. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి' అని అన్నారు. 'సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది' అని నిర్మాతలు చెప్పారు. దర్శకుడు రాజారెడ్డి పానుగంటి మాట్లాడుతూ, 'గతంలో నేను చేసిన 'ఓ మధు' సినిమా 100 డేస్ ఆడింది. ఈ చిత్రాన్ని మా నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా' అని తెలిపారు.