Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరుణ్ విజయ్ హీరోగా సి.హెచ్. సతీష్ కుమార్ అసోసియేషన్‌తో జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్, మూవీ స్లయిడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం 'ఆక్రోశం'. జి.యన్.కుమార వేలన్ డైరెక్షన్లో ఆర్.విజయ్ కుమార్ నిర్మించారు.
యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్, ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన తమిళ చిత్రం 'సినం'ను తెలుగులో 'ఆక్రోశం' పేరుతో ఈనెల 16న భారీ లెవల్లో విడుదల చేయటానికి నిర్మాత ఆర్.విజయ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా బుధవారం మీడియాతో నిర్మాత సి.హెచ్.సతీష్ కుమార్ మాట్లాడుతూ, 'కుటుంబంలోని అన్ని ఎమోషన్స్‌ను చూపిస్తూ అందరూ కలిసి చూసే విధంగా ఉంటుంది. మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రస్తుతం మన సమాజానికి చెప్పాల్సిన కొన్ని పాయింట్స్‌ను కథ రూపంలో చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్ కుమార వేలన్' అని తెలిపారు. హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ, 'మహిళలతోపాటు కుటుంబ సభ్యులు అందరూ ఈ సినిమాను ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. సినిమాలో మంచి మెసేజ్ ఉంటుంది. ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. 'ఏనుగు' చిత్రాన్ని రిలీజ్ చేసిన సతీష్ ఈ సినిమాను రిలీజ్ చేయనుండటం చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు.