Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం 'చెప్పాలని ఉంది'. ఒక మాతృభాష కథ అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు.
ఈనెల 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో యష్ పూరి మాట్లాడుతూ, 'అన్నపూర్ణ స్టూడియోస్ 'అలాంటి సిత్రాలు'లో నటించా. హీరోగా తొలి సినిమానే సూపర్ గుడ్ ఫిల్మ్స్ లాంటి పెద్ద బ్యానర్లో లభించడం నా అతృష్టం. పరాయి భాషని గౌరవిద్దాం,.. మాతృభాషని ప్రేమిద్దాం వంటి చాలా బలమైన మీనింగ్ ఉన్న కంటెంట్ ఇది. అయితే ఇది సందేశం చెప్పేలా ఉండదు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఉంటుంది. ఈ సినిమా మొదటి హీరో కథే. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎంటర్టైనర్ ఇది. సినిమాలు తీయడంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ మాస్టర్స్. ఈ సినిమాని అద్భుతంగా తీశారు. చివరి 30 నిమిషాలు విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది. కాశ్మీర్లో చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య చాలా హార్డ్ వర్క్ చేసి షూట్ చేశాం. ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వాలని కష్టపడి పని చేశాం. ఇందులో జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తా. సడన్‌గా వేరే భాష మాట్లాడుతా. అది ఎవరికీ అర్ధం కాదు. ఆ వేరే భాష నాకు ఎందుకు వచ్చిందో సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ వేరే భాష కారణంగా చాలా సమస్యలు వస్తాయి. నా దగ్గర ఉన్న వాళ్ళు దూరం అవుతారు. నన్ను ఎవరూ అర్ధం చేసుకోలేరు. నాకు ఏదో చెప్పాలని ఉంటుంది. కానీ చెప్పలేకపొతుంటాను. కొరియన్ భాష రిథమ్ ప్రకారం ఒక కొత్త భాషని క్రియేట్ చేశాం. ప్రస్తుతం సిల్లీ మాంక్‌తో ఒక సినిమా చేశా. అది కూడా క్యూట్ స్టొరీ' అని చెప్పారు.