Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం. కన్నడ దర్శకుడు, నటుడు నాగశేఖర్ ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ నిర్మించారు. చినబాబు, ఎం.సుబ్బారెడ్ది సమర్పించిన ఈ చిత్రం ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ, 'ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. అద్భుతమైన విజయం సాధిస్తుంది' అని తెలిపారు. 'ఈ సినిమా బాగా రావడానికి కారణమైన మా హీరో, హీరోయిన్లకి థ్యాంక్స్. లక్ష్మీ భూపాల మంచి మాటలు రాశారు. కాల భైరవ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా చూస్తే మీరు ఒక చల్లని గాలిని ఫీల్ అవుతారు' అని దర్శకుడు అన్నారు.
హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ, 'నాకు సమ్మర్ అంటే ఇష్టం. కానీ ఈ సినిమాలో యాక్ట్ చేశాక శీతాకాలంపై ఇష్టం ఏర్పడింది' అని తెలిపారు. 'ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ ఇది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది' అని హీరో సత్యదేవ్ అన్నారు. హీరో అడవి శేష్ మాట్లాడుతూ, 'డైరెక్టర్ నాగశేఖర్కి ఈ సినిమా 'మైనా' అంత హిట్ అవ్వాలి' అని అన్నారు.